పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులకి అదిరిపోయే ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఈ రోజు ఉదయం భీమ్లా నాయక్ నుండి టైటిల్ సాంగ్ విడుదల చేశారు. ఈ చిత్ర సాంగ్ ప్రేక్షకులకి మాంచి ట్రీట్ అందించింది. ఇక కొద్ది సేపటి క్రితం పవన్ నటిస్తున్న మరో చిత్రం హరిహర వీరమల్లు కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
ఏప్రిల్ 29, 2022న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా తెలియజేశారు. జనవరి 12, 2022న భీమ్లా నాయక్ విడుదల కానుండగా, సినిమా రిలీజైన మూడు నెలలకు హరిహర వీరమల్లు చిత్రం థియేటర్స్‌లోకి రానుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే మోషన్ పోస్టర్ విడుదల చేశారు. దీనికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
భారీ బడ్జెట్ తో క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో వజ్రాల దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నాడు. పవన్ కల్యాణ్ కెరియర్లోనే భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్లు వేయించారు