Harihara Veeramallu | పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలపై అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా అంటే ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. హరిహర వీరమల్లు చిత్రం ఎప్పుడో విడుదల కావల్సి ఉండగా, పవన్ పొలిటికల్ లైఫ్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. వాయిదా విషయంలో ఇప్పటికే సరికొత్త రికార్డ్ కూడా క్రియేట్ చేశారు పవన్. అయితే జూన్ 12న చిత్రాన్ని తప్పనిసరిగా విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్ . ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ వీలైనంత ఎక్కువగా చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి నార్త్‌లో కూడా మూవీని గట్టిగానే ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారట.
నిర్మాత ఏఎమ్ రత్నం ఇప్పటికే దీనిపై ఒక క్లారిటీకి వచ్చినట్టు సినీవర్గాలు చెబుతున్నాయి. ముంబై వేదికగా ప్రీరిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్‌తో పాటు ఒక బాలీవుడ్ హీరోని గెస్ట్‌గా ఇన్వైట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అందులోను మెగా ఫ్యామిలీకి బాలీవుడ్ హీరోలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో హరిహర వీరమల్లు ఈవెంట్‌కి ఏ స్టార్ అయిన వచ్చే అవకాశం ఉంది. సల్లూబాయ్ పేరు అయితే గట్టిగా వినిపిస్తుంది.
బాలీవుడ్ స్థాయిలో పవన్ తొలి సినిమా కావడంతో సల్మాన్ వస్తే సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని, తద్వారా హిట్ సాధించవచ్చని నిర్మాతలు భావిస్తున్నారు. పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు దూరం అయ్యాడు. రాజకీయాలలో అంతగా రాణించకపోవడంతో వకీల్ సాబ్, బీమ్లా నాయక్, బ్రో వంటి రీమేక్స్ సినిమాలు చేశారు. అయితే అవి అంతగా అలరించలేకపోయాయి. చాలా రోజుల తర్వాత పవన్ చేస్తున్న స్ట్రైట్ సినిమా హరిహర వీరమల్లు కాగా, ఈ మూవీ పాటలు, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ గట్టిగా చెబుతున్నారు.