Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న “హరి హర వీర మల్లు” సినిమా ట్రైలర్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ట్రైలర్‌ను జూలై 3వ తేదీ ఉదయం 11:10 గంటలకు గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో థియేటర్లలో ట్రైలర్ స్క్రీనింగ్‌కు ఏర్పాట్లు చేసారు. అభిమానుల్లో ట్రైలర్‌పై నెలకొన్న ఉత్సాహం చూస్తుంటే సినిమాని భారీ హిట్ చేసేలా కనిపిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ సమీపంలోని సంధ్య థియేటర్ లో కూడా ట్రైలర్ స్క్రీనింగ్ ప్లాన్ చేసారు. కాని అక్కడి పరిస్థితులు ఊహించనంతగా మారిపోయాయి. జూలై 2న ఉదయం ఎంట్రీ పాస్‌ల కోసం భారీగా అభిమానులు గుమిగూడడంతో, పరిస్థితి నియంత్రణకు పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది.
ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, సంధ్య థియేటర్ యాజమాన్యం భద్రతా కారణాలతో ట్రైలర్ స్క్రీనింగ్‌ను రద్దు చేసింది. “పుష్ప 2ష సినిమా రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ను చూసేందుకు భారీగా వచ్చిన అభిమానుల కారణంగా ఏం జరిగిందో మనందరికి తెలిసిందే. అందుకే సెక్యూరిటీ విషయంలో ఏ పొరపాటూ జరగకుండా చూసేందుకు థియేటర్ యాజమాన్యం, పోలీసులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. సంధ్య ధియేటర్లో ట్రైలర్ స్క్రీనింగ్ క్యాన్సిల్ చేసిన హైదరాబాద్ లోని ఇతర థియేటర్లలో ట్రైలర్ స్క్రీనింగ్ యథాతథంగా కొనసాగుతుంది.
హరి హర వీర మల్లు ట్రైలర్ థియేటర్లతో పాటు యూట్యూబ్‌లోనూ విడుదల కానుంది. 3 నిమిషాల 1 సెకన్ నిడివితో ఉండనున్న ఈ ట్రైలర్లో పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన ఎలివేషన్ సీన్లు, పొలిటికల్ డైలాగ్స్ హైలైట్ కానున్నాయని తెలుస్తోంది. ట్రైలర్ ఫైనల్ కట్‌ను పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి వీక్షించి దర్శకుడిని అభినందించడం మనం చూశాం. ఈ చిత్రంలో కథానాయికగా నిధి అగర్వాల్ నటించింది. ఇందులో మునుపెన్నడు కనిపించని గెటప్‌లో కనిపించనుందట. మొదట క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రాన్ని, ఆ తర్వాత నిర్మాత ఏ.ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారు.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌తో పాటు అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.