Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన తర్వాత నిత్యం కీలక సమీక్షలు, సమావేశాలు, ఆ తర్వాత జిల్లాల పర్యటనలు, ప్రజలతో మమేకం ఇలా క్షణం తీరిక లేకుండా బిజీ అయ్యారు. కమిటైన సినిమాలు పూర్తి చేయాలన్నా కూడా పవన్ కళ్యాణ్‌కి తీరిక దొరకడం లేదు. పవన్ బిజీ వల్ల ఇదివరకే ఒప్పందం చేసుకొని చేస్తున్న సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఓజీ సంగతేమో కాని పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. హరిహర వీరమల్లు సినిమా మే9 న రిలీజ్ పక్కా అంటూ నిర్మాతలు పోస్టర్స్ వేస్తునే ఉన్నారు.
ఇటీవల డబ్బింగ్ కూడా స్టార్ట్ అయిందని క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఓ వారం రోజులు డేట్స్ ఇస్తే చిత్ర షూటింగ్ పూర్తి అయిపోతుంది. కాని పవన్ కళ్యాణ్ మాత్రం బిజీ షెడ్యూల్స్ వలన డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరి పవన్ సన్నివేశాలు లేకుండా సినిమాని విడుదల చేయాలన్నా కూడా, ఆ సీన్స్ మూవీకి అత్యంత కీలకమైన సన్నివేశాలు. ఎట్టి పరిస్థితులలో వాటితోనే సినిమాని విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. గత వారమే షూటింగ్ పూర్తి కావలసి ఉన్నా కూడా ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ లో అగ్నిప్రమాదం జరగడం తో హుటాహుటిన అక్కడికి బయలుదేరాడు. రీసెంట్గా తిరిగి హైదరాబాద్‌కి వచ్చాడు పవన్.
ఇక వెంటనే షూటింగ్స్‌లో పాల్గొంటాడని అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ చేసే మూడ్‌లో లేడని మరో వారం రోజులు ఆగమన్నాడని టాక్ వినిపిస్తుంది. దీంతో నిర్మాత ఏఏం రత్నం దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. మే నెలలో చిత్రాన్ని విడుదల చేయకపోతే అమెజాన్ ప్రైమ్ సంస్థ కాంట్రాక్టు రద్దు చేసుకుంటామని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే మే 9న చిత్రాన్ని రిలీజ్ చేయవచ్చు. లేదంటే నిర్మాత అనేక సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్ల రూపాయల బడ్జెట్ దాటేసింది. మరి అంత బడ్జెట్ నిర్మాతకి వస్తుందా లేదా అనేది చూడాలి.