Hari Hara Veeramallu | పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలలో రూపొందిన పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు ఐదేళ్ళ పాటు సినిమా షూటింగ్ జరుపుకుంది. మొదట్లో ఈ చిత్రానికి క్రిష్ డైరెక్షన్ అందించగా, అనుకోని కారణాల వలన ఆయన తప్పుకోవడంతో జ్యోతికృష్ణ మెగా ఫోన్ పట్టాల్సి వచ్చింది. ఇక సినిమా రిలీజ్ కి కేవలం రెండు రోజుల ముందు రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ జోరు పెంచాడు.. ప్రెస్ మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో పాల్గొని సినిమాకి సంబంధించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఆసక్తి పెంచారు.
ఎట్టకేలకి సినిమా చూసిన పవన్ ఫ్యాన్స్.. పవన్ కళ్యాణ్ వన్ మాన్ షో, యాక్షన్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ పీక్స్‌లో ఉన్నాయి అంటూ గర్వంగా చెబుతున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ గ్లామర్, ఎంఎం కీరవాణి మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయని, ప్రత్యేకంగా పవన్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌కు థియేటర్లు దద్దరిల్లాయని అంటున్నారు. అయితే పవన్ యాంటీ ఫ్యాన్స్, ప్రత్యర్ధులు మాత్రం సినిమాపై విమర్శలు కురిపిస్తున్నారు. ఫస్ట్ హాఫ్‌లో క్రిష్ టచ్ కనిపించినా, సెకండ్ హాఫ్ మాత్రం బోర్ కొట్టింది అని కామెంట్లు పెడుతున్నారు. టేకింగ్ చాలా వీక్‌గా ఉందని, విజువల్ ఎఫెక్ట్స్ కూడా డిసప్పాయింట్ చేశాయని విమర్శిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ అయితే ఓసారి చూడొచ్చు అంటున్నా, మిగిలినవారు మాత్రం చూడలేము అని కామెంట్స్ చేస్తున్నారు.
పవన్ అభిమానులు #BlockbusterHariHaraVeeraMallu అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుండగా, వ్యతిరేక వర్గాలు, ముఖ్యంగా ప్రత్యర్ధులు #DisasterHariHaraVeeraMallu అనే హ్యాష్‌ట్యాగ్‌తో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. కొంతమంది సినిమా టేకింగ్, స్క్రీన్‌ప్లే, వీఎఫ్ఎక్స్ స్థాయిపై తీవ్రమైన విమర్శలు చేస్తుండగా, మరోవైపు అభిమానులు మాత్రం ఇది పవన్‌కి పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ మూవీ, ఎవ్వరూ మిస్ అవ్వకూడదు అంటూ ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘హరిహర వీరమల్లు’ స్ట్రీమింగ్కు రాబోతోంది.