Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చారిత్రక యాక్షన్ డ్రామా ‘హరి హర వీర మల్లు’. ఈ చిత్రం జులై 24న దేశవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి విశేషమైన స్పందన లభించగా, సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ యోధుడిగా కనిపించనున్నాడు. ఇక చిత్ర విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. అయితే ఇప్పటివరకు పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్లను భారీ స్థాయిలో నిర్వహించాలని మేకర్స్ సీరియస్‌గా ప్లాన్ చేస్తున్నారు.
జులై 17న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరగనున్న ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరుకానున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి యోగితో పాటు రాష్ట్ర మంత్రులు, భోజ్‌పురి సినీ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఉత్తర భారతంలో సినిమాపై హైప్ క్రియేట్ చేయాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని తర్వాత జూలై 19న తిరుపతిలో మరో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసే అవకాశం ఉంది. ఆయనతో పాటు మరికొంతమంది రాష్ట్ర మంత్రులు కూడా ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో పాల్గొననున్నారని తెలుస్తోంది.
హరిహర వీరమల్లు చిత్రానికి జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించగా, కథ నిర్మాణంలో జ్యోతి కృష్ణ కూడా భాగంగా ఉన్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. దయాకర్ రావు మరియు ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రం సాంఘిక సందేశంతో పాటు చారిత్రక నేపథ్యాన్ని మిళితం చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.