పవన్‌కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ థియేట్రికల్ ట్రైలర్ గురువారం విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన క్షణం నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఈ ట్రైలర్‌కు బ్రహ్మరథం పడుతున్నారని మేకర్స్ తెలిపారు. 24 గంటల్లోనే 48 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు ట్రైలర్‌గా ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రికార్డును నెలకొల్పిందని, అన్ని భాషల్లో కలిపి దాదాపు 62 మిలియన్ల వ్యూస్ సాధించిందని శుక్రవారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు.
జ్యోతికృష్ణ దర్శకత్వ ప్రతిభ, ఎం.ఎం.కీరవాణి నేపథ్య సంగీతం, జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంసల విజువల్స్, సాయిమాధవ్ బుర్రా శక్తివంతమైన సంభాషణలు, అన్నింటినీ మించి ట్రైలర్లో పవన్‌కల్యాణ్ అభినయం.. ఇవన్నీ ఆడియన్స్‌ని మంత్రముగ్థుల్ని చేశాయని నిర్మాత ఎ.దయాకర్‌రావు అభిప్రాయపడ్డారు. రాజ కుటుంబీకురాలిగా నిధి అగర్వాల్, ఔరంగజేబుగా బాబీ డియోల్ స్క్రీన్ ప్రెజెన్స్ ట్రైలర్‌కు నిండుతనాన్ని తెచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 24న పాన్ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంలో అనుపమ్‌ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సమర్పణ: ఎ.ఎం.రత్నం