Hari Hara Veera Mallu | ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ షురూ..పవన్ సెట్స్‌కు వచ్చే డేట్ ఫిక్స్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). ఈ చిత్రాన్ని క్రిష్ (Krish) డైరెక్ట్ చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ ఈ చిత్రానికి ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు అంటే 5 నెలల వరకు కాల్షీట్లు ఇచ్చాడని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.
టాలీవుడ్ (Tollywood) అపకమింగ్ క్రేజీయెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో ముందు వరుసలో ఉన్న చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ (Krish) డైరెక్ట్ చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ ఈ చిత్రానికి ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు అంటే 5 నెలల వరకు కాల్షీట్లు ఇచ్చాడని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.
తాజాగా పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే అప్డేట్ వచ్చేసింది. హరిహర వీరమల్లు షూటింగ్ ఇవాళ హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్స్ లో మొదలైంది. పవన్ కల్యాణ్ కూడా ముందుగా వచ్చిన అప్ డేట్ ప్రకారం ఏప్రిల్ 8 నుంచి షూట్లో పాల్గొననున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీ రోల్స్ పోషిస్తున్నారు.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నిధి అగర్వాల్ (Nidhi Agerwal) ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరోవైపు పవన్ ఇప్పటికే సముద్రఖని డైరెక్షన్లో వినోదయ సీతమ్ రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమా కోసం 21 రోజులు డేట్స్ ఇచ్చాడని తెలుస్తోండగా..జెట్ స్పీడులో షూటింగ్ పూర్తి చేయనున్నాడట పవన్.
Read Also : Samantha Vs Chaitanya | బాక్సాఫీస్ క్రేజీ ఫైట్..సమంత వర్సెస్ చైతూ వర్సెస్ అఖిల్..!
మరోవైపు హిట్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్ సింగ్ కూడా లైన్లో పెట్టాడు. పై రెండు చిత్రాలు పూర్తవగానే హరీష్ శంకర్ సినిమాతో బిజీ కానున్నాడు పవన్ కల్యాణ్. మరోవైపు 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తానని ప్రకటించాడు పవన్. ఓ వైపు సినిమాలు..ఇంకో వైపు పాలిటిక్స్ ఎలా హ్యాండిల్ చేస్తాడోనని అనుకుంటున్నారు సినీ జనాలు.
Read Also : Saiee Manjrekar | వరుణ్‌తేజ్ స్వీటెస్ట్ కోస్టార్..గని హీరోయిన్ సయీ మంజ్రేకర్ చిట్‌చాట్
Read Also: Tollywood Villain | స్ట్రాంగ్ విలన్ కోసం టాలీవుడ్ ఎదురుచూపులు..!
Read Also : Chiranjeevi | పవన్ కల్యాణ్ పాపులర్ సీన్ చేయబోతున్న చిరంజీవి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

