Hari Hara Veera Mallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు నిన్నటినుంచి సంబరాలు చేసుకుంటున్నారు. చాలా రోజులుగా ఫ్యాన్స్ ఎదురుచూసిన హరిహర వీరమల్లు ట్రైలర్ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే అద్భుతమైన రికార్డులను సృష్టించి టాలీవుడ్లో సరికొత్త చరిత్రను లిఖిస్తుంది. ఇప్పటివరకు 24 గంటల్లో యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పేరిటా ఈ రికార్డు ఉండగా.. ఇప్పుడది హరి హర వీరమల్లు సొంతం చేసుకుంది. ఈ చిత్రం కేవలం 24 గంటల్లో తెలుగులో మాత్రమే 48 మిలియన్లకు పైగా (4.8 కోట్ల) వ్యూస్ సాధించి, తెలుగు చిత్ర పరిశ్రమలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ పొందిన ట్రైలర్‌గా నిలిచింది. అలాగే అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్ 61.7 మిలియన్లకు పైగా (6.17 కోట్ల) వ్యూస్ సాధించిందని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో టాలీవుడ్ చరిత్రలో ఈ రికార్డు సాధించిన మొదటి చిత్రంగా హరి హర వీరమల్లు రికార్డులకెక్కింది.
ఈ ట్రైలర్లో పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్‌లు, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక జూలై 24, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
Yesterday the director said – Ee Saari Date maaradhu – Industry Record lu maaruthayi .
And you know exactly what just happened 😉
Powerstar @PawanKalyan’s #HHVMTrailer is now the 𝗠𝗢𝗦𝗧 𝗩𝗜𝗘𝗪𝗘𝗗 𝗧𝗘𝗟𝗨𝗚𝗨 𝗧𝗥𝗔𝗜𝗟𝗘𝗥 𝗜𝗡 𝟮𝟰 𝗛𝗢𝗨𝗥𝗦 with 𝟰𝟴+ 𝗠𝗜𝗟𝗟𝗜𝗢𝗡… pic.twitter.com/asu7njfF4G
— Hari Hara Veera Mallu (@HHVMFilm) July 4, 2025