Hari Hara Veera Mallu | పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘హరి హర వీర మల్లు’. ఈ సినిమా ఇటీవల వాయిదా పడిన విషయం తెలిసిందే. జూన్ 12న రావాల్సిన ఈ చిత్రం గ్రాఫిక్స్ పనుల కారణంగా ఆలస్యం అవుతుండడంతో వాయిదా వేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమాకు విడుదల తేదీకి సంబంధించి తాజాగా మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాను జూన్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఓవర్సీస్కి చెందిన డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌లో హరిహర వీరమల్లు జూన్ 26న రాబోతుందంటూ పోస్ట్ పెట్టారు. కాగా దీనిపై చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఎ.ఎమ్. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఎ.ఎమ్. రత్నం సమర్పణలో, మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు హరిహర వీరమల్లు నిర్మాతకి ప్రైమ్ వీడియో కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది.
#HariHaraVeeraMallu ROARING INTO CINEMAS 26th June 2025#PawanKalyan #OG #PSPK https://t.co/vEwV4dd3Zz pic.twitter.com/ZE8lO0zydK
— Australian Telugu Films (@AuTelugu_Films) June 9, 2025