Hari Hara Veera Mallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, ఏ.ఎం. జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌తో రన్ అవుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ.ఎం. రత్నం నిర్మించారు. తెలంగాణలో మిశ్రమ స్పందన రాబట్టినప్పటికీ, ఏపీలోని ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి వంటి కొన్ని ప్రాంతాల్లో ‘హరిహర వీరమల్లు’ ఆల్ టైమ్ రికార్డు నంబర్ గ్రాస్‌తో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇదిలావుంటే ఈ సినిమాలని కాపాడాలని జనసేన మంత్రులు పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్న ఆడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఈ క్రమంలోనే నేడు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ఉచిత ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఈ ప్రత్యేక షోలను నిర్వహిస్తున్నారు. వీటిలో భాగంగా, జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గంలోని మూడు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 9, 10, ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కోసం నేడు ఉచిత ప్రదర్శనలు జరుగనున్నాయి. సీతానగరంలోని గీతా సినిమాస్ మరియు కోరుకొండలోని రామకృష్ణ థియేటర్లలో ఈ షోలు ప్రదర్శితం కానున్నాయి. రాజానగరం నియోజకవర్గంతో పాటు, రాష్ట్రంలోని మరికొన్ని ఏరియాలలో కూడా ఈరోజు ‘హరిహర వీరమల్లు’ ఫ్రీ షోలు వేయనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
హరిహర వీరమల్లు ఫ్రీ షోలు వేస్తున్న జనసేన ఎమ్మెల్యే
నేడు జూలై 27 రోజున 9, 10, ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థుల కోసం కోరుకొండ, సీతానగరంలో రామకృష్ణ థియేటర్, గీతా సినిమాస్ నందు హరిహర వీరమల్లు 2 ఫ్రీ షోలు వేయనున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ https://t.co/2FWgyTGBsN pic.twitter.com/TGneY10UOJ
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2025