‘నేను మ్యూజిక్ అందించిన అమరన్, లక్కీభాస్కర్ చిత్రాలు ఈ దీపావళికి విడుదలై విజయాలు సాధించడం ఆనందంగా ఉంది. రాబోతున్న ‘మట్కా’ కూడా హిట్ పక్కా.’ అంటూ నటుడు, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్‌కుమార్ నమ్మకం వెలిబుచ్చారు. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా కరుణకుమార్ దర్శకత్వంలో డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన హైబడ్జెట్ మూవీ ‘మట్కా’. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా గురువారం చిత్ర సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్‌కుమార్ విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘దర్శకుడు కరుణకుమార్ అద్భుతమైన స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉన్న దర్శకుడు. ఆయన డార్క్ ఫిల్మ్ మేకింగ్ ైస్టెలిష్‌గా ఉంటుంది. నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా హై బడ్జెట్లో సినిమా తీశారు. ఇది పీరియాడికల్ స్టోరీ. మ్యూజిక్ కూడా అందుకు తగ్గట్టే ఉండాలి. ఆడియన్‌ని ఆ కాలంలోకి తీసుకెళ్లాలి.
అందుకే మోడరన్ సింథ్స్ వాడడం కుదరదు. పాత తరహా మ్యూజిక్‌నే వాడాలి. అది నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది. పైగా ‘మట్కా’ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్. ‘గాడ్ ఫాదర్’ తరహాలో వయోలెన్స్, యాక్షన్, హై ఎమోషన్ ఉంటుంది. అందుకే ఛాలెంజ్‌గా తీసుకొని చేశాను. ముఖ్యంగా స్టోరీ, డైరెక్షన్, నటీనటుల యాక్టింగ్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయి. తెరపై కొత్త వరుణ్‌తేజ్‌ని చూస్తారు.’ అని చెప్పారు జి.వి.ప్రకాశ్‌కుమార్. సంగీత దర్శకునిగా వంద సినిమాలు పూర్తి చేయడం ఆనందంగా ఉందని, యుగానికొక్కడు, మద్రాసు పట్టణం, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, ఆకాశమే హద్దు, ఇప్పడు ‘మట్కా’.. ఇలా పొంతన లేని జానర్లకు సంగీతం అందించాననీ, ఆదరిస్తున్న దక్షిణాది ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాననీ జీవి ప్రకాశ్‌కుమార్ అన్నారు.