Upasana | టాలీవుడ్ స్టార్ నటుడు రామ్‌చరణ్ (Ram Charan) సతీమణి, మెగా కోడలు ఉపాసన (Upasana) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన క్యూట్ వీడియో ఇన్‌స్టా వేదికగా ఉప్సీ షేర్ చేసింది.
ఉపాసన తల్లిదండ్రులు శోభన, అనిల్ కామినేని వివాహ వార్షికోత్సవ వేడుకలను కుటుంబ సభ్యులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. దుబాయ్ బీచ్‌లో కుటుంబం అంతా కలిసి సందడి చేశారు. ఈ వేడుకల్లో ఉపాసన, రామ్ చరణ్‌తోపాటు వారి ముద్దుల కుమార్తె క్లీంకార (Klin Kaara) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇందుకు సంబంధించిన క్యూట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఉప్సీ తల్లిదండ్రులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక క్లీంకార పుట్టి ఈ జూన్ 20వ తేదీకి రెండేళ్లు పూర్తి కానున్న విషయం తెలిసిందే.
Also Read..
Samantha | అది నా ఫస్ట్ లవ్.. ఇక సినిమాలకు విరామం ఉండదు : సమంత
Shambaji Maharaaj | శంభాజీ మహారాజ్ స్త్రీలోలుడు.. ‘ఛావా’ సినిమాపై సంచలన నిజాలు
Aadhi Pinisetty | నటితో విడాకులంటూ వార్తలు.. స్పందించిన నటుడు ఆది పినిశెట్టి