ఓ మంచి క్యారెక్టర్ పడితే హద్దుల్లేని నవ్వులు పండిస్తారు వెన్నెల కిషోర్. ఆయన నటించిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. ఈ సినిమాకు రితేష్ రానా దర్శకత్వం వహించారు. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్నది. సత్య, నరేష్ అగస్త్య ఇతర కీ రోల్స్‌లో కనిపించనున్నారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెరీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా జూలై 15న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ పోషించిన కేంద్రమంత్రి రితిక్ సోది పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఇతను ఓ వర్గానికి విరోధి అంటూ వాయిస్ఓవర్ రాగా..రెండు చేతుల్లో గన్స్‌తో వెన్నెల కిషోర్ కనిపించాడు. ఈ పాత్రలో అతను నవ్వులు పూయించడం ఖాయంలా కనిపిస్తున్నది. త్వరలో ఈ చిత్రంలోని మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సురేష్ సారంగం, సంగీతం : కాలభైరవ, లైన్‌ప్రొడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయికుమార్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాలసుబ్రమణ్యం కేవీవీ.