Hanuman Sequel | ‘హనుమాన్’ కు సీక్వెల్.. టైటిల్ ఏంటో తెలుసా..?
Jai Hanuman | టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’(Hanuman). తేజ సజ్జా(Teja Sajja) కథా నాయకుడిగా నటించిన ఈ సినిమా ఇప్పటికే గ్లోబల్ లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది. దేశవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
Jai Hanuman | టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’(Hanuman). తేజ సజ్జా(Teja Sajja) కథా నాయకుడిగా నటించిన ఈ సినిమా ఇప్పటికే గ్లోబల్ లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది. దేశవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నది. దీంతో మూవీ లవర్స్ కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ సినిమా ముగింపులో అభిమానులకు ఒక సాలిడ్ అప్డేట్ను ఉంచాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
ఈ సినిమా క్లైమాక్స్ పూర్తయిన అనంతరం.. ఎండ్ క్రెడిట్స్ వచ్చే ముందు ఓ అదిరిపోయే సర్ప్రైజ్ను ఇచ్చాడు ప్రశాంత్. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని వెల్లడించాడు. ఈ సినిమా మొదటి పార్ట్‌కు ‘హనుమాన్’ అని టైటిల్ పెట్టిన ప్రశాంత్ హనుమాన్ పార్ట్ 2కు ‘జై హనుమాన్’ (Jai Hanuman) అని టైటిల్ ఫిక్స్ చేశాడు. 2025లో జై హనుమాన్ రానుందని వెల్లడించాడు.
తేజ సజ్జా – అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో వినయ్ రాయ్ స్టైలిష్ విలన్‌గా ఆకట్టుకున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్రఖని వంటి నటీనటులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చైతన్య సమర్పిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

