Hanuman Movie | టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం హనుమాన్ (Hanuman). భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుండగా, ఇందులో జాంబి రెడ్డి కథానాయకుడు తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటిస్తున్నాడు. ఇక సూపర్ హీరో సిరీస్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. యూనివర్సల్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే హై టెక్నికల్ వాల్యూస్‌తో కట్ చేసిన విజువల్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు తెగ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్‌కు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. హనుమాన్ ట్రైలర్ అనౌన్స్‌మెంట్‌ను డిసెంబర్ 12న ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
#HANUMAN Trailer Announcement on DECEMBER 12th🔥
🌟ing @tejasajja123
In WW Cinemas from JAN 12th, 2024!#HanuManTuesday 💫 @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @GowrahariK @Primeshowtweets @Chaitanyaniran @AsrinReddy @tipsofficial @tipsmusicsouth @ThePVCU… pic.twitter.com/uYA84YOOae
— Prasanth Varma (@PrasanthVarma) December 5, 2023