Hanuman Movie Teaser | ‘అ!’, ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ వంటి వినూత్న సినిమాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు ప్రశాంత్ వర్మ. ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన సూపర్ హీరో ఫాంటసీ నేపథ్యంలో ‘హనుమాన్’ అనే పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్నాడు. తేజా సజ్జా హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా చిత్రబృందం టీజర్ అప్డేట్ను ప్రకటించింది.
ఈ సినిమా టీజర్‌ను ముందుగా నవంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కానీ సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో టీజర్ రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేశారు. కాగా తాజాగా మేకర్స్ కొత్త డేట్‌ను వెల్లడించారు. హనుమాన్ టీజర్‌ను నవంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. సూపర్ హీరో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ నటిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తుంది. డాక్టర్ ఫేం వినయ్‌రాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
#HanuManTeaser on NOV 21st @ 12:33PM💥
🌟ing @tejasajja123#SuperHeroHanuMan ❤️🔥@Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Niran_Reddy @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets @tipsmusicsouth pic.twitter.com/Ecnoo1hHji
— Prasanth Varma (@PrasanthVarma) November 19, 2022