Hanuman | ఎక్కడైనా పెయిడ్ ప్రీమియర్స్ అంటే 10-15 షోస్ వేస్తారు.. మరీ కాన్ఫిడెంట్‌గా ఉంటే ఇంకో పాతిక ఎక్స్ ట్రా వేస్తారు. అంతేకానీ ఒకేసారి 300 షోలు వేయడమనేది కనివిని ఎరగలేదు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని సాధ్యం చేసి చూపించారు హనుమాన్ టీం. ముందు 50 ప్రీమియర్స్ వేయాలి అనుకున్నారు.. కానీ వాళ్లు టికెట్స్ పెట్టిన 10 నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ కావడంతో ఇంకో 50 యాడ్ చేశారు. అలా 50- 50 అంటూ ఏకంగా 300 ప్రీమియర్ షోస్ ప్లాన్ చేశారు. కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇంతగా ప్రీమియర్ షోస్ పడిన సినిమా మరొకటి లేదు. పైగా అన్ని షోస్ కు టికెట్స్ హౌస్ ఫుల్ కావడంతో దర్శక నిర్మాతలు గాల్లో తేలిపోతున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే సినిమా జనవరి 12 కాదు 11నే విడుదలవుతుంది అనుకోవాలి. ఇక్కడ వాళ్లకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే ఒకేసారి అన్ని షోలు వేయడం వెనుక కూడా ఒక పెద్ద కథ ఉంది. జనవరి 12న మహేశ్‌బాబు గుంటూరు కారం విడుదలవుతుంది కాబట్టి ఆ రోజు వాళ్లు కోరుకున్న దాని కంటే చాలా తక్కువ థియేటర్స్ ఇచ్చారు. హైదరాబాద్‌లో కేవలం 4 సింగిల్ స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత రోజు వెంకటేశ్ సినిమా.. మరుసటి రోజు నాగార్జున సినిమా వస్తుంది కాబట్టి అసలు హనుమాన్ సినిమాకు థియేటర్స్ వస్తాయా రావా అనే డౌట్స్ కూడా అందరిలోనూ ఉన్నాయి.
ఇలాంటి సమయంలో ముందు రోజు ప్రీమియర్స్ వేసుకోవడం అనేది మంచి ఆలోచన. ఎలాగో వాళ్లకు తర్వాత రెండు మూడు రోజులు థియేటర్స్ సరిగ్గా ఉండవు. కాబట్టి దొరికిన ఛాన్స్ వాడుకుంటున్నారు. ఇందులో రిస్క్ కూడా ఉంది.. కానీ వాళ్లకు వేరే ఆప్షన్ కూడా లేదు. కాబట్టి ఆ సాహసం కూడా చేస్తున్నారు. అందుకే ముందు రోజు దాదాపు 300 ప్రీమియర్ షోలు వేస్తున్నారు. దానివల్ల వాళ్లకు కోటిన్నరకు పైగానే ఆదాయం వచ్చేలా కనిపిస్తోంది. ఒకవేళ వాళ్ల అదృష్టం బావుండి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది అంటే ఆ తర్వాత జనాలు దాన్ని మోసుకుంటూ వెళ్తారు. ప్రత్యేకంగా ప్రమోషన్స్ అవసరం లేదు. ఎలాగూ సంక్రాంతి సీజన్ కాబట్టి కచ్చితంగా కుటుంబ ప్రేక్షకులు గుంటూరు కారం తర్వాత హనుమాన్ వైపు చూస్తారు. ఎటోచ్చీ ఇప్పుడు ప్రీమియర్స్‌కు పాజిటివ్ టాక్ రావాలి అని వాళ్లు కోరుకోవాలి అంతే!