Hanuman Movie | టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘హనుమాన్’ (Hanuman). భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీగా ఈ చిత్రం రాగా తేజ సజ్జా, అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.210 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి శ్రీరామదూత స్తోత్రం సాంగ్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి అంజనాద్రి థీమ్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ పాటలో హనుమంతుని జననం నుంచి.. సూర్యుడిని పండు అనుకోని మింగడం, ఇంద్రుడు హనుమంతుడిపై వజ్రాయుధం సంధించడం లాంటివి చూడవచ్చు. ఇక ఈ పాటకు శివశక్తి దత్తా లిరిక్స్ అందించగా.. సాయి చరణ్ భాస్కరుణి ఆలపించారు. గౌరహరి సంగీతం సమకుర్చాడు.