ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్నది. ప్రతి వారం ఏదో ఒక చిత్రం పునఃవిడుదలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నది. అదే వరుసలో ఇప్పుడు అర్జున్, జగపతిబాబు నటించిన ‘హనుమాన్ జంక్షన్’ (2001) చిత్రం ఈ నెల 28న మరలా ప్రేక్షకుల ముందుకురానుంది.
మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్ని పోషించారు. కుటుంబ భావోద్వేగాలు, వినోదం సమపాళ్లలో కలబోసిన ఈ తరహా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని, అందుకే రీరిలీజ్ చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఎం.ఎల్.మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎం.వి.లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు.