పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన గణం చాలా ఉంది. ఆయనని చిన్న వాళ్ల నుండి పెద్ద వాళ్ల వరకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇండియన్ క్రికెట్ టీమ్ లో కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. యంగ్ క్రికెటర్ హనుమ విహారి సందర్భం వచ్చినప్పుడల్లా పవన్‌పై తన ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. ప్రస్తుతం ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్‌తో బిజీగా ఉన్న హనుమ.. తాజాగా తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
పవన్‌తో నేను దిగిన ఫొటో ఇది. ఆరేళ్ల క్రితం ఈ ఫొటో దిగాను. నాకు ఇష్టమైన నటుడు, ఆదర్శంగా నిలిచే వ్యక్తి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ హనుమ విహారి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. కాకినాడకు చెందిన హనుమ విహారి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ఇటీవల భీమ్లా నాయక్‌కి సంబంధించి పలు అప్డేట్స్ రాగా, వాటిపై తనదైన శైలిలో స్పందించాడు హనుమ విహారి.
హనుమ విహారి.. టీమిండియా మెంబర్ కాగా, ఇంగ్లాండ్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లను ఆడుతున్నాడు. ఇప్పటి వరకు మూడు టెస్ట్‌లు జరగగా, అతనికి ఆడే అవకాశం రాలేదు. నేటి నుండి నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుండగా, ఈ మ్యాచ్‌లో అయిన అవకాశం దక్కుతుందేమోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.