అంజనాద్రి ప్రపంచంలోకి తీసుకెళ్లే హను-మాన్
ధర్మం ఉన్నచోట హనుమంతుడు ఉంటారు.. హనుమంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది.. అని తెలియజెప్పే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘హను-మాన్'. సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామాగా దర్శకుడు ప్రశాంత్‌వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ హీరోహీరోయిన్లు. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక భూమిక పోషిస్తున్నది.
ధర్మం ఉన్నచోట హనుమంతుడు ఉంటారు.. హనుమంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది.. అని తెలియజెప్పే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘హను-మాన్’. సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామాగా దర్శకుడు ప్రశాంత్‌వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ హీరోహీరోయిన్లు. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక భూమిక పోషిస్తున్నది. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. జనవరి 12న పాన్ ఇండియాతో పాటు ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో పాన్ వరల్డ్ సినిమాగా ఇది విడుదల కానుంది. ట్రైలర్‌ని మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఆడియన్స్‌ని అందమైన అంజనాద్రి ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఈ ట్రైలర్‌ని కట్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం రామనామంతో, హనుమ తేజంతో, ఆసక్తికరమైన యాక్షన్ డ్రామాతో సాగింది. హిమాలయాల్లో హనుమంతుని సాక్షాత్కారం ఈ ట్రైలర్లో హైలైట్. దర్శకుడు మాట్లాడుతూ ‘మనందరి ఇష్టదైవం హనుమంతుడు. ఆయనే రియల్ సూపర్‌హీరో. ఈ సినిమా టీజర్ రిలీజైన తర్వాత ‘హనుమంతుడు ఎవరు? ఆయన గొప్పతనం ఏంటి?’ అని తల్లిదండ్రుల్ని పిల్లలు అడుగుతున్నారని తెలిసి చాలా ఆనందించాను.
ఆయన పాత్రను స్పూర్తిగా తీసుకొని నేటి తరానికి తగ్గట్టు తయారు చేసిన కథ ఇది. దాదాపు 1500 థియటర్లలో విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. మామూలు కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే, వాడు చేసే సాహసాలేంటి? అనేదే ఈ సినిమా అని తేజ సజ్జా అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

