Hanu Man | అ!, కల్కి, జాంబిరెడ్డి వంటి వినూత్న సినిమాలను తెరకెక్కిస్తూ విమర్శకుల ప్రశంసలు పొందిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈయన సినిమాలు ప్రేక్షకుల ఆలోచనా స్థాయికి మించి ఉంటాయి. గతంలో ఈయన తెరకెక్కించిన షార్ట్ ఫిలింస్ కూడా మన ఆలోచనలకు అందని విధంగా ఉంటాయి. లేటెస్ట్గా ఈయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హను-మాన్’. ఇండియాస్ ఫస్ట్ సూపర్ హీరో ఫిలిం అంటూ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం 100 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపైన భారీ అంచనాలను నమోదు చేశాయి. అంతేకాకుండా ఈ చిత్రానికి తెలుగు డిజిటల్, శాటిలైట్ హక్కులకు కలిపి దాదాపు 11 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇటీవలే విడుదలైన వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది. అమృత అయ్యర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది.ప్రైమ్ షో ఎంటర్టైనమెంట్ పతాకంపై కే. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్నాడు.