Hansal Mehta – Balakrishna | టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. యువ నటుడు విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari). ఈ సినిమా మే 31న ప్రేక్షకులు ముందుకు రానుండగా.. ఈ నెల 28న గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా వచ్చిన హీరో బాలకృష్ణ వేడుకలో భాగంగా నటి అంజలిని నెట్టివేయడం పలు వివాదలకు దారి తీసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు బాలయ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా బాలయ్య విచిత్ర ప్రవర్తన చూసిన బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు విమర్శలు గుప్పించాడు.
బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. స్కామ్1992 (Scam 1992), ఛల్, షాహిద్, సిటీలైట్స్, అలీఘర్ తదితర చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈ దర్శకుడు బాలకృష్ణ అనుచిత ప్రవర్తనపై విమర్శలు గుప్పించాడు. ఎవరు ఈ సభ్యత సంస్కారం లేని మనిషి అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. మరోవైపు ఇదే ఈవెంట్లో బాలయ్య వాటర్ బాటిల్లో మందు కలుపుకోని ఈవెంట్కు వచ్చినట్లు కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Who is this scumbag? https://t.co/KUVZjMZY2M
— Hansal Mehta (@mehtahansal) May 29, 2024