Chiranjeevi | తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar)కు హైదరాబాద్ అంటే చాలా ఇష్టమని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly) షూటింగ్లో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నాడు అజిత్. తన సూపర్ బైక్ మీద హైదరాబాద్ రోడ్లపై అజిత్ కుమార్చక్కర్లు కొట్టిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ స్టార్ యాక్టర్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటనుకుంటున్నారా..? చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర సినిమా సెట్స్‌కు వెళ్లాడు అజిత్‌కుమార్.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు చిరంజీవి. నిన్న సాయంత్రం విశ్వంభర (Vishwambhara) సెట్స్‌లోకి సర్ప్రైజ్ స్టార్ గెస్ట్ వచ్చారు. సమీపంలోనే జరుగుతున్న షూటింగ్ లొకేషన్ నుంచి మా దగ్గరకు వచ్చారు. నా చేతుల మీదుగా నిర్వహించిన అజిత్ డెబ్యూ సినిమా ప్రేమ పుస్తకం మ్యూజిక్ లాంఛ్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాం. చాలా ఏండ్లుగా అజిత్ కుమార్ సూపర్ స్టార్డమ్ సంపాదించుకోవడం సంతోషంగా ఉంది. అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ షూట్లో ఉన్నాడు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు చిరు.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న గుడ్ బ్యాడ్ అగ్లీని మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. అజిత్ టీం హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత త్వరలోనే అజిత్ టీం రష్యాకు వెళ్లనుందని ఇన్సైడ్ టాక్. ఈ ఇత్రంలో అజిత్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతుండగా.. వీటిలో ఒకటి నెగెటివ్ రోల్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
2025 పొంగళ్ కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తు్న్నారని సమాచారం. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో సోషల్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతుంది విశ్వంభర. త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Mega Star #Chiranjeevi Recent Instagram Post About Meeting Thala #AjithKumar 😍
” Had a Surprise star guest of #Vishwambhara last evening.. The Very Affectionate #Ajithkumar who’s shooting next door visited & we had a great time chatting up & fondly recollecting the time of his… pic.twitter.com/2SKzwMQRuX
— Kolly Corner (@kollycorner) May 29, 2024
విశ్వంభర సెట్స్‌లో అజిత్‌కుమార్..