ఓవైపు సంగీత దర్శకుడిగా ప్రతిభ చాటుతూనే నటుడిగా కూడా రాణిస్తున్నారు జీవీ ప్రకాష్ కుమార్. స్వీయ నిర్మాణంలో ఆయన నటిస్తున్న తాజా ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘కింగ్స్‌స్టన్’. కమల్ప్రకాష్ దర్శకుడు. ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది.
శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. సముద్రం మీద సాహసాలు, అతీతశక్తులు, ఫాంటసీ కలబోసిన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతున్నది. సముద్రంలో హీరో చేసే సాహసాలు రోమాంచితంగా సాగుతాయని, విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమున్న చిత్రమని మేకర్స్ తెలిపారు. దివ్యభారతి, చేతన్, అళగన్ పెరుమాళ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, దర్శకత్వం: కమల్ప్రకాష్.