యువ నటుడు విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త ఒరిజినల్ వెబ్ సిరీస్ గుర్తుకొస్తున్నాయి (Gurthukosthunnayi). ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
‘ఈటీవీ విన్’ ఓటీటీ ప్లాట్ఫామ్లో జూలై 3 నుండి డిజిటల్ స్ట్రీమింగ్ కానున్న ఈ డ్రామాను దర్శకుడు వినోద్ గాలి అద్భుతంగా తెరకెక్కించారు. శరత్ చంద్ర నాయుడు నిర్మాణంలో, అజయ్ అరసాడ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సిరీస్ ట్రైలర్.. చిన్ననాటి జ్ఞాపకాలు, కుటుంబ బంధాలు, జీవితంలోని మధురమైన క్షణాలను గుర్తుచేస్తూ ఎమోషనల్గా సాగింది. ముఖ్యంగా విరాజ్ అశ్విన్, యశశ్రీ రావుల నటనతో పాటు సీనియర్ నటి రోహిణి హట్టంగడి పాత్ర ఈ సిరీస్కు ప్రధాన బలంగా నిలవనుంది. శివనారాయణ, గోపరాజు రమణ, వైవా రాఘవ, అనీష్ కురువిల్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ETV Win is back with another nostalgic entertainer! 👌#Gurthukosthunnayi premieres on July 3rd. pic.twitter.com/IuBZgezRNc
— cinee worldd (@Cinee_Worldd) June 27, 2026