Gunturu Kaaram | జోరు తగ్గిన ‘గుంటూరు కారం’ కలెక్షన్స్.. రెండో రోజు ఎంత వసూలు చేసిందంటే?
Gunturu Kaaram | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ) కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం (Gunturu Kaaram). అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Gunturu Kaaram | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ) కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Gunturu Kaaram). అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటిరోజే ఈ సినిమాకు కొంచెం మిక్స్డ్ టాక్ రావడంలో కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ ఆ అంచనాలను తలకిందులు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
మొదటిరోజు వరల్డ్ వైడ్‌గా రూ.94 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు అదే ఫామ్ కొనసాగించింది. ఈ సినిమా రెండు రోజుల్లో ఇప్పటివరకు రూ.127 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక రానున్న రెండు రోజులు సంక్రాంతి సెలవులు ఉండడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది.
రమణగాడి 𝗦𝗨𝗣𝗘𝗥 𝗦𝗔𝗡𝗞𝗥𝗔𝗡𝗧𝗛𝗜 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 💥#GunturKaaram grosses over 𝟏𝟐𝟕 𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 in 2 Days Worldwide 🔥
ఈ భోగికి మీలో ఉన్న Egos & Haterd కాల్చేస్తారు అని ఆశిస్తూ, మీ అందరికి భోగి శుభాకాంక్షలు ✨
Watch the #BlockbusterGunturKaaram at cinemas… pic.twitter.com/eEzgwNFdXZ
— BA Raju’s Team (@baraju_SuperHit) January 14, 2024
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సత్యం (జయరామ్), వసుంధర (రమ్యకృష్ణ)ల కొడుకు రమణ (మహేశ్‌బాబు). సత్యం ఓ హత్య కేసులో జైలుకి వెళ్తాడు. వసుంధర ఐదేళ్ళ కొడుకు రమణని వదిలేసి రెండో పెళ్లి చెసుకుంటుంది. రమణ గుంటూరులో తన మేనత్త బుజ్జి (ఈశ్వరిరావు) దగ్గర పెరుగుతాడు. పాతికేళ్ళు గడుస్తాయి. వసుంధర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగి మంత్రి అవుతుంది. వసుంధర తండ్రి వైరా వెంకటస్వామి (ప్రకాశ్‌రాజ్). వసుంధరకి పుట్టిన రెండో కొడుకుని వారసుడిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటాడు. తన ప్రయత్నానికి వసుంధర మొదటి కొడుకు రమణ భవిష్యత్ లో అడ్డురావచ్చని భావించిన వెంకటస్వామి… వసుంధరతో రమణ అన్నీ రకాలుగా తెగతెంపులు చేసుకునే విధంగా అగ్రిమెంట్ రెడీ చేసి, దానిపై రమణతో సంతకం పెట్టించుకునే బాధ్యత లాయర్ ఫణి (మురళీ శర్మ) కి అప్పగిస్తాడు. మరి రమణ …ఆ అగ్రిమెంట్‌పై సంతకం పెట్టాడా? అసలు కన్నకొడుకుని వసుంధర ఎందుకు దూరం పెట్టింది? రమణకి తన తల్లిపై వున్న ప్రేమ ఎలాంటిది ? అసలు ఈ కథలో విలన్ ఎవరు ? ఇవన్నీ తెరపై చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

