Gunturu Kaaram | గుంటూరు కారం నుంచి హృదయాలను హత్తుకునే ‘అమ్మ’ సాంగ్ రిలీజ్
Gunturu Kaaram | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ) కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Gunturu Kaaram). అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
Gunturu Kaaram | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ) కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Gunturu Kaaram). అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటిరోజే ఈ సినిమాకు కొంచెం మిక్స్డ్ టాక్ రావడంలో కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలోని సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ధమ్ మసాలా, కుర్చీ మడత పెట్టి, ఓహ్ మై బేబీ, సాంగ్ లు విడుదల చేయగా.. చార్ట్ బస్టర్లుగా నిలిచాయి.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ‘అమ్మ'(Amma) అనే ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు. పసి వాడయై వేచి చూస్తుందా బదులే రాని గతం. పగ వాడయై నింద మోస్తుందా ఎదుటే ఉన్న నిజం అంటూ సాగిన ఈ పాట హృదయాలను హత్తుకునేలా ఉంది. ఇక ఈ పాటకు ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. విశాల్ మిశ్రా పాడాడు. థమన్ సంగీతం అందించాడు.
ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ తల్లి పాత్రలో నటించింది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు ఈ సినిమాను నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

