S.S.Thaman | ఒక సినిమాకు పాటలు ఎంత కీలకమో..ఆర్ఆర్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతకంటే ఎక్కువే కీలకం. హీరోకు సరైన ఎలివేషన్ పడాలన్నా.. క్యారెక్టర్స్‌లో ఎమోషన్ పండాలన్నా ఇవి చాలా కీలకం. ఈ మధ్య కాలంలో వీటి గురించి ప్రస్తావన వస్తే మొదటగా వినిపించే పేరు థమన్. కాపీ మరకలు ఎన్ని వచ్చినా.. థమన్ బ్యాక్‌గ్రౌండ్‌కు థియేటర్లే వచ్చే రెస్పాన్స్ అరాచకం. కేవలం థమన్ మ్యూజిక్ వల్లే ఎన్నో సీన్లు ప్రాణం పోసుకున్నాయనడంలో అతిశయోక్తి లేదు. అఖండనే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్‌కు థమన్ మ్యూజిక్ తోడై థియేటర్లు దద్దరిల్లిపోయాయి. మరీ ముఖ్యంగా థమన్ ఇచ్చిన ఆర్ఆర్కు సౌండ్ బాక్సులు పేలిపోయాయని థియేటర్ల నుంచి కంప్లైట్స్ కూడా వచ్చాయి.
కాగా తాజాగా బోయాపాటి, థమన్ కాంబోలో వచ్చిన స్కంద బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అరుపులు పెట్టించేలా ఉందని.. చెవులు దద్దరిల్లిపోతున్నాయని పలువురు తెలుపుతున్నారు. అఖండకు ఏమాత్రం తగ్గని స్థాయిలో సౌండ్ పొల్యూషన్ సృష్టించాడని ఆడియెన్స్ వెల్లడిస్తున్నారు. కాగా తాజాగా స్వయంగా గుంటూరుకు చెందిన గౌరీ శంకర్ థియేటర్ యాజమాన్యం అయితే ట్విట్టర్లో దీని గురించి ఓ స్పెషల్ స్టోరీనే రాసుకొచ్చారు.
థమన్‌ను ఎవరైనా కంట్రోల్ చేయాలని.. లేదంటే థియేటర్లలో సౌండ్ సిస్టమ్స్ తట్టుకోవడం కష్టమని, స్కంద సినిమా ప్రదర్శన సందర్భంగా సౌండ్ పొల్యూషన్ తట్టుకోలేక ప్రేక్షకులే సౌండ్ తగ్గించాలని విన్నపాలు చేశారని.. ఇది ప్రేక్షకులతో పాటు థియేటర్ల యాజామాన్యాలకు కూడా ఇబ్బందిగా మారిందని ట్విట్టర్లో ఆ సదరు సంస్థ రాసుకొచ్చింది. ఇక ఇటీవలే స్కంద ప్రమోషన్లలో రామ్ పోతినేని.. థమన్ మ్యూజిక్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. థమన్ మ్యూజిక్కు స్పీకర్స్ బ్లాస్ట్ అవడం పక్కా. థియేటర్ ఓనర్లు మళ్లీ కొత్తగా రెనోవేట్ చేసుకోవాల్సిందే అనే రేంజ్లో రామ్.. థమన్‌కు ఎలివేషన్ ఇచ్చాడు. ఆ ఎలివేషన్ కరెక్టే అని ఈ ట్వీట్‌తో తేలిపోయింది.
Someone needs to make an effort to control Mr. Thaman. These audio decibel levels are outrageous. An inconvenience to both us theater owners whose equipment is getting affected and the audience who are complaining about the volume levels.
— GowriShankar Theatre (@GSCinemasGnt) September 28, 2023