Guntur Kaaram | మహేశ్‌బాబు ‘గుంటూరుకారం’ సినిమా ఏ ముహూర్తంలో మొదలైందో గానీ.. సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచీ నిన్నమొన్నటివరకూ రకరకాల వార్తలు.. ఊహాగానాలు. కథానాయికల మార్పులంటూ.. స్క్రిప్ట్‌లో దర్శకుడు త్రివిక్రమ్ మార్పులు చేర్పులు చేశారంటూ ఏదో ఒక విషయంలో ఈ సినిమా వార్తల్లో ఉంటూనే ఉంది. ఎట్టకేలకు ఈ సినిమాపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ క్లారిటీ ఇచ్చేశారు.
ఎట్టిపరిస్థితుల్లో ‘గుంటూరుకారం’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని, ఈ వారంలో ఈ సినిమాకు చెందిన తొలిపాటను విడుదల చేస్తామని మీడియా సాక్షిగా తెలియజేశారు నాగవంశీ. ఇంకా రెండు నెలలే సమయం ఉందని, ఈ రెండు నెలల్లో నాలుగు సింగిల్స్ విడుదల చేయాలి కాబట్టి, ఇకనుంచి సినిమా ప్రమోషన్లో వేగం పెంచుతామని నిర్మాత తెలియజేశారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, పి.ఎస్.విందా.