మహేశ్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన హీరో ఇంట్రడక్షన్ ఫైట్‌ని హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో, ఫైట్‌మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్‌ల నేతృత్వంలో భారీగా చిత్రీకరిస్తున్నారు. ఎనిమిదిరోజుల పాటు ఈ ఫైట్ చిత్రీకరణ జరుగనున్నట్లు సమాచారం. ఈ సినిమా కథ ఆద్యంతం గుంటూరు మిర్చీయార్డ్ నేపథ్యంలో నడుస్తుందని తెలిసింది. మహేశ్ పాత్ర చిత్రణ కూడా వైవిద్యంగా ఉంటుందట. మీనాక్షీ చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.