Guntur Kaaram Movie | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం'(Guntur Kaaram). శ్రీలీల కథానాయిక. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న భారీ అంచనాలున్న సినిమాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. మహేశ్ – త్రివిక్రమ్ శైలి మాస్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి దమ్ మసాలా బిర్యానీ.. ఎర్ర కారం… అర కోడి అంటూ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయగా.. ఈ పాట సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.
గుంటూరు కారం నుంచి సెకండ్ సింగిల్ ఓ మై బేబీ సాంగ్ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ”అమ్ము.. రమణ గాడు గుర్తు పెట్టుకో గుంటూరు వస్తే పనికొస్తది.. ఓ మై బేబీ” అంటూ ఈ ప్రోమో సాగింది. ఇక ఈ సాంగ్ చూస్తే.. రొమాంటిక్ మెలోడి అని తెలుస్తుంది. ఈ పాటను శిల్పా రావు ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరోవైపు ఈ సాంగ్ ఫుల్ వెర్షన్‌ను డిసెంబర్ 13న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Here’s a blissful melody with a blistering Coffee! ☕💞
Swing along with #OhMyBaby ❤️ ~ Promo out now – https://t.co/CjJCb3MKMq
Full song will be out on 13th December. 🎵
A @MusicThaman Musical 🎹🥁
✍️ @ramjowrites
🎤 @shilparao11#GunturKaaram SUPER 🌟 @urstrulyMahesh… pic.twitter.com/oWnLEwEJAj— Aditya Music (@adityamusic) December 11, 2023
గుంటూరు కారం 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ సినిమాలో మహేశ్ బాబు అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేస్తోంది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.