Guntur Kaaram Movie | సంక్రాంతి పండగను ఆర్నెళ్ల ముందే లాక్ చేసుకున్న సినిమా గుంటూరు కారం. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఈ సారి చెప్పిన డేట్ కన్ఫార్మ్ అని పదే పదే మేకర్స్ చెబుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి నిర్మాత నాగవంశీ కూడా సంక్రాంతికే ఫిక్స్ అని బల్లగుద్ది చెప్పాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. నాలుగు పాటలకు సంబంధించిన మేకింగ్‌తో పాటు ఓ చిన్న టాకీ పార్టు ఉందట. త్రివిక్రమ్ ఈ సారి బాబును మాములుగా చూపించట్లేదని ఇన్సైడ్ టాక్. అతడు, ఖలేజా సినిమాలో క్యారెక్టర్లకు మాస్ తోడైతే ఏ రేంజ్లో ఉంటుందో మహేష్ రోల్ ఆ రేంజ్లో ఉంటుందట.
ఇక ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఎప్పుడెప్పుడా అంటూ కాయలు కాచేలా ఎదురు చూస్తున్న గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ఆల్రెడీ రెడీ అయిపోయిందని నాగవంశీ ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు. ఎప్పుడు రిలీజ్ అన్నది మాత్రం చెప్పలేదు. కాగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను లండన్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు ఓ రూమర్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఇక ఇటీవలే థమన్ లండర్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతున్నట్లు తెలిపాడు. కాగా ఇదే కాన్సర్ట్‌లో గుంటూరు కారం ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు తెగ వైరల్ అవుతుంది.
ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. లండన్‌లో రిలీజ్ చేస్తే మట్టుకు ఈ సినిమా రీచ్ పీక్ లెవల్‌కు వెళ్లిపోతుంది. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న హాట్రిక్ సినిమా కావడంతో అందరిలోనూ ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ఇక ఈ మధ్య విడుదలైన గ్లింప్స్‌కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు నటిస్తున్నారు. థమన్ స్వరాలందిస్తున్నాడు. ఇప్పటికే ఓ పాటను రెడీ కూడా చేశాడట. దసరా సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధా కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇక ఈ సినిమాకు బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరుగుతుందట. కేవలం నైజాం రైట్స్‌ను కోసమే దిల్‌రాజు కొట్లు ఆఫర్ చేశాడట. సరైన నెంబర్ తెలీదు కానీ.. ఇండస్ట్రీ టాక్ ప్రకారం రూ.45 కోట్లని సమాచారం. ఇక దిల్‌రాజు సినిమాకు సంబంధించిన కొన్ని రషెస్ చూశాడట. అవి చూసిన తర్వాత సంక్రాంతికి సరైన బొమ్మ ఇదేనని ఈ రేటు పెట్టాడట. ఇక మాములుగా దిల్‌రాజు అంటేనే సక్సెస్‌కు ఎగ్జాంపుల్. ఒకటి రెండు సినిమాలను జడ్జ్ చేయడంలో లెక్క తప్పాడు కానీ.. ఆయన జడ్జిమెంట్‌కు తిరుగుండదు. అలాంటి మనిషి గుంటూరు కారం సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడంటే మహేష్ అభిమానులు సినిమా వేరే లెవల్లో ఉండబోతుందని ఫిక్సయిపోయారు.