S.S.Thaman | త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా ఎటు వెళ్తుందో ఎవరికీ తెలియట్లేదు. అప్పుడెప్పుడో ఏడాదినర్ధం కిందట మొదలైన ప్రాజెక్ట్ ఇంకా ఓ కొలిక్కి దశకు రాలేదు. దానికి తోడు నటీనటులు నుంచి టెక్నీషియన్ల వరకు మారుతూనే ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతిపై ఖర్చీఫ్ వేసుకున్న ఈ సినిమా అప్పటి లోగా పూర్తవుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక ఇవన్నీ ఒకత్తయితే థమన్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నాడన్న వార్తలు షూటింగ్ ప్రారంభమైన్నుంచి వస్తూనే ఉన్నాయి. థమన్ ఎప్పటికప్పుడూ ఆ రూమర్స్‌కు చెక్ పెడుతూనే ఉన్నా.. మళ్లీ మళ్లీ అవే మాటలు వినిపిస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే తాజాగా తమన్‌కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట హల్ చేస్తుంది. ఇక థమన్ ఇప్పుడు టైమ్ అంతా గుంటూరు కారంకే ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌ను కూడా రెడీ చేశాడని.. మహేష్ విని ఒకే చేస్తే, ఆ పాటను ఆగస్టు 9న రిలీజ్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. అంతేకాకుండా సంక్రాంతి వరకు ప్రతీ నెల ఒక పాటను రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. దానికి థమన్ సైతం ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం థమన్ చేతిలో అరడజనుకు పైగానే సినిమాలున్నాయి.
శ్రీలీల మెయిన్ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాలతో మాజి మిస్ ఇండియా మీనాక్షీ చౌదరీ సెకండ్ హీరోయిన్గా నటిస్తుంది. హారికా అండ్ హాసని క్రియేషన్స్ పతాకంపై ఎస్.చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.