Guntur Kaaram Movie | ఇంకా మూడ్నెళ్లకు పైగా ఉన్న గుంటూరు కారం సినిమాపై జనాల్లో మాములు అంచనాల్లేవు. ఈ సారి సంక్రాంతికి బాక్సాఫీస్ బద్దలైపోవడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. గురూజీ సైతం మహేష్‌బాబును ఊరమాస్‌గా చూపించబోతున్నాడట. ఇన్ని రోజులుగా కాస్త సాఫ్ట్ కార్నర్ ఉన్న రోల్స్ చేసిన మహేష్.. ఈ సారి మాస్‌తో పిచ్చెక్కించడానికి రెడీ అయిపోతున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ గట్రా ఫ్యాన్స్‌ను ఓ రేంజ్లో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ఆర్నేళ్ల ముందే సంక్రాంతి స్లాట్‌ను బుక్ చేసుకుని అదే దిశగా పరుగులు పెడుతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ నిర్విరామంగా షూటింగ్‌ను జరుపుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా బిజినెస్ లెక్కలు ఒక్కొటి బయటకు వచ్చి సంచలనం రేపుతున్నాయి. ఆ మధ్య దిల్‌రాజు ఈ సినిమాను ఒక్క నైజాం రైట్స్‌నే రూ.40 కోట్ల పెట్టి కొన్నాడని న్యూస్ తెగ హల్ చల్ చేసింది. తాజాగా ఈ సినిమా ఓవరల్ బిజినెస్ చూస్తే కళ్లుచెదరడం ఖాయం. ఇక ఈ సినిమా ఓవరల్ బిజినెస్ అక్షరాల రూ.120 కోట్లు. ఒక రీజినల్ సినిమాకు ఈ రేంజ్ థియేట్రికల్ బిజినెస్ అంటే మాములు విషయం కాదు. పైగా అతడు, ఖలేజా వంటి క్లాసిక్స్ తర్వాత వీళ్ల కాంబోలో సినిమా తెరకెక్కుతుండటంతో డిస్ట్రిబ్యూటర్లు ఎంత రేటైనా పెట్టడానికి రెడీగా ఉన్నారట.
ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు నటిస్తున్నారు. థమన్ స్వరాలందిస్తున్నాడు. ఇప్పటికే ఓ పాటను రెడీ కూడా చేశాడట. దసరా సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధా కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.