Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం ఉదయం 4.51 గంటలకు బాంద్రాలోని ఆయన ఇంటి వద్ద దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు.
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం ఉదయం 4.51 గంటలకు బాంద్రాలోని ఆయన ఇంటి వద్ద దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. అనంతరం గెలాక్సీ అపార్టుమెంట్స్ బయట నాలుగు రౌండ్లు కాల్చారు. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు యత్నిస్తున్నారు.
గతంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. 1998లో కృష్ణ జింకను వేటాడి తమ మనోభావాలను కండల వీరుడు దెబ్బతీశాడని, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించాడు. దీంతో ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రతను పోలీసులు కల్పిస్తున్నారు. తాజా కాల్పుల నేపథ్యంలో ఆయన ఇంటివద్ద మరింత భద్రతను పెంచారు. గతేడాది ఏప్రిల్ 11న సల్మాన్‌కు చంపుతామంటూ బెదిరిస్తూ ఈ- మెయిల్ వచ్చింది. యూకేలో ఉంటున్న భారత యువకుడు అది చేసినట్లు గుర్తించిన పోలీసులు, అతనిపై లుక్అవుట్ నోటీసులు జారీచేశారు.

#WATCH | Mumbai, Maharashtra: Visuals from outside actor Salman Khan’s residence in Bandra where two unidentified men opened fire this morning.
Police and forensic team present on the spot. pic.twitter.com/5vMmoXbI22
— ANI (@ANI) April 14, 2024
#WATCH | Mumbai, Maharashtra: Visuals from outside actor Salman Khan’s residence in Bandra where two unidentified men opened fire this morning.
Police and forensic team present on the spot. pic.twitter.com/fVXgHzEW0J
— ANI (@ANI) April 14, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

