గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకుడు. పీపుల్ మీడియా, చిత్రాలయం స్టూడియోస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘గుంగురు గుంగురు..’ అనే మాస్ గీతాన్ని విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ పాటను సురేష్ గంగుల రచించారు. రోహిణి సోరట్ ఆలపించారు. హుషారైన మాస్ బీట్తో తెరకెక్కించిన ఈ పాటలో నాయకానాయికల నృత్యాలు హైలైట్గా నిలిచాయి. థియేటర్లో ఈ పాట ఓ పండగలా ఉండబోతుందని చిత్ర బృందం పేర్కొంది. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, సమర్పణ: దోనేపూడి చక్రపాణి, దర్శకత్వం: శ్రీను వైట్ల.