ఏబీసీడీ ప్రొడక్షన్స్ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘గల్లీ గ్యాంగ్స్టార్స్’. ధర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘నెల్లూరులో చిత్రీకరణ జరిపాం.
ఒక గల్లీలో నివసించే అనాథలు, వాళ్లు ఎదురుకునే సమస్యల సమాహారంగా కథ నడుస్తుంది. క్రైమ్ డ్రామాగా మెప్పిస్తుంది. సినిమా మొత్తం నాలుగు ముఖ్య పాత్రల మీద నడుస్తుంది’ అని చెప్పారు. సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్, రితిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత: అరవేటి యశోవర్ధన్, సంగీతం: సత్య, శరత్ రామ్ రవి.