Tollywood| చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన చాలా మంది ఇప్పుడు హీరో,హీరోయిన్స్‌గా కూడా సందడి చేస్తున్నారు. మరి కొందరు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. అయితే చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన చాలా మంది పెద్దయ్యాక అంతగా రాణించలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. అమాయకమైన నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకున్న ఈ చిన్నారి పేరు గ్రీష్మ నేత్రిక కాగా, ఈమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించి అశోక్ చిత్రంలో బాల నటిగా కనిపించి సందడి చేసింది. అలానే వెంకటేశ్ నటించిన మల్లీశ్వరి సినిమాలోనూ కనిపించింది. ఈ చిత్రంలో వెంకీ అన్న కూతురిగా నటించింది. ముద్దు ముద్దు మాటలతో అమాయకమైన నటనతో ప్రేక్షకులను ఆక్టటుకుంది.
ఈ క్యూటీ.. అమ్ములు, మల్లీశ్వరి, అశోక్, కొంచెం ఇస్టం కొంచెం కష్టం, ప్రస్తానం, పంచాక్షరి, ఏమో గుర్రం ఎగరవచ్చు వంటి చిత్రాలలో కనిపించి బాలనటిగా అలరించింది. ఆమె తాజా ఫోటోలు చూసిన నెటిజన్స్ స్టన్ అవుతున్నారు. ప్రస్తుతం ‘గ్రీష్మ నేత్రిక ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలోనూ పెద్ద యాక్టివ్‌గా ఉండదు. అయితే ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలని నెటిజన్స్ తెగ వెతికేస్తుండగా, అమ్మడికి సంబంధించిన కొన్నిఫొటోలు నెట్టింట దర్శనం ఇచ్చాయి. ఇందులో గ్రీష్మ నేతికని చూసిన వారందరు అమ్మాయి భలే బాగుందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చిందని, హీరోయిన్ ఫీచర్స్ ఉన్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈమె ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.ఈమె హైదరాబాద్ లో ఓ కంపెనీలో వర్క్ చేస్తోంది. సినిమా ఆఫర్స్ కోసం కూడా ట్రై చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.