Bollywood Actor Govinda | బాలీవుడ్ దిగ్గజ నటుడు గోవిందా తన భార్య సునీత అహుజాతో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. 1987 మార్చి 11న పెళ్లి చేసుకున్న ఈ జంట తమ 37 ఏండ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు… గోవిందా & సునీతా అహుజా కొంతకాలంగా విడిగా జీవిస్తున్నారని, వారి వైవాహిక జీవితంలో తలెత్తిన కొన్ని సమస్యల కారణంగా విడాకుల వైపు అడుగులు వేస్తున్నారని వార్తలు వచ్చాయి. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా సునీతా మాట్లాడుతూ.. తాను & గోవిందా వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నట్లు చెప్పడంతో పాటు. తాను ఒక ఫ్లాట్లో తన పిల్లలతో ఉంటుండగా, గోవిందా ఎదురుగా ఉన్న బంగళాలో నివసిస్తున్నారని ఆమె వెల్లడించారు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై గోవిందా తాజాగా క్లారిటీ ఇచ్చాడు.
గోవిందా మాట్లాడుతూ.. మీడియాలో వస్తున్న వార్తలన్ని అబద్దం. నా ఇంటికి వచ్చేవారంతా బిజినెస్ పనుల్లో భాగంగా.. సినిమా పనుల్లో భాగంగా వస్తున్నారు. అంతేగాని విడాకుల కోసం కాదంటూ గోవిందా వెల్లడించారు. మరోవైపు గోవిందా మేనేజర్ మాట్లాడుతూ.. విడాకులు వార్తలను ఖండించారు. కుటుంబంలోని కొందరూ వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు కారణంగా ఈలాంటి వార్తలు వస్తున్నాయి. గోవిందా , సునీత అహుజాల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నవి నిజమే కానీ.. విడాకులు తీసుకునేంతా కాదు. గోవిందా ప్రస్తుతం సినిమాల బిజీలో ఉన్నారు అంటూ మేనేజర్ చెప్పుకోచ్చాడు.