Ye Maya Chesave-2 Movie | టాలీవుడ్లో కొన్ని ప్రేమ కథలకు విపరీతమైన క్రేజ్ ఉంది. గీతాంజలి, తొలిప్రేమ వంటి సినిమాలు పేరుకు ప్రేమ కథలే అయిన.. కమర్షియల్‌గా మాస్ సినిమాలకు మించి విజయాలు సాధించాయి. ఇక ఇదే కోవలోకి నాగచైతన్య ‘ఏమాయ చేశావే’ సినిమా కూడా చేరుతుంది. అప్పటికి నాగచైతన్య ఒక్క సినిమా మాత్రమే తీశాడు. పైగా అది డిజాస్టర్. దాంతో ఓ మోస్తరు అంచనాలతో రిలీజైన ఏమాయ చేశావే బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఊహకందని కలెక్షన్లు సాధించి నాగచైతన్యకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిచింది.
సమంత చేసిన తొలి తెలుగు చిత్రమిదే. ఈ సినిమాతో నాగచైతన్యకు ఎంత క్రేజ్ వచ్చిందో.. సమంతకు కూడా అంతే క్రేజ్ వచ్చింది. ఆన్ స్క్రీన్‌పై వీళ్ళ జోడికీ ప్రేక్షకులు వంద మార్కులు వేశారు. దాంతో రీల్ లైఫ్ ప్రేమికులు కాస్త రియల్ లైఫ్ ప్రేమికులు అయ్యారు. షూటింగ్ సమయంలోనే ఒకరిపై ఒకరు మనసు పారేసుకున్న చైసామ్ కొన్ని రోజుల డేటింగ్ తర్వాత ఘనంగా వివాహం చేసుకున్నారు. కానీ వీళ్ళ బంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకే విడాకుల బాట పట్టారు. ప్రస్తుతం వీరిద్ధరూ ఒంటిరి జీవితాన్ని గడుపుతున్నారు. ఇక ఇదిలా ఉంటే వీళ్ల ప్రేమకు పునాదైన ఏమాయ చేశావే సినిమాకు సీక్వెల్ రూపుదిద్దుకుంటుంది.
ఇటీవలే గౌతమ్ మీనన్ ఈ సినిమాకు సీక్వెల్ రెడీ చేస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలిపాడు. కాగా ఈ సీక్వెల్లో సమంత ప్లేస్‌లో రష్మిక హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా సీక్వెల్ కథ కూడా నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాత వాళ్ల జీవితాలు ఎలా మారాయి అనే నేపథ్యంలో సాగనుందట. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.