Aamir Khan | బాలీవుడ్ (Bollywood)లో ఉన్న టాలెంటెడ్ స్టార్ హీరోల్లో టాప్‌లో ఉంటాడు అమీర్‌ఖాన్ (Aamir Khan). కొంత కాలంగా ప్రొఫెషనల్‌గా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే అమీర్‌ఖాన్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన వార్త ఒకటి మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ విషయమేంటనుకుంటున్నారా…? అమీర్‌ఖాన్ రిలేషన్షిప్ వార్త. ఈ స్టార్ యాక్టర్ రెండో భార్య కిరణ్‌రావ్‌కు విడాకులిచ్చాడని తెలిసిందే.
ఈ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం దంగల్ ఫేం ఫాతిమా సనా షేక్(Fatima Sana Shaik) అంటూ గతంలో చాలా వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఇదే వార్త నెట్టింట మరోసారి హల్ చల్ చేస్తోంది. అమీర్‌ఖాన్‌తో ఇప్పటికే దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాల్లో మెరిసింది. అమీర్‌ఖాన్ హోం ప్రొడక్షన్లో ఫాతిమాతో మరో సినిమాకు సంతకం చేయడం ఈ వార్తలకు మరింత ఊపునిస్తోంది. ఈ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారంటూ పుకార్లు నెట్టింట షికారు చేస్తున్నాయి.
మరి దీనిపై అమీర్‌ఖాన్, ఫాతిమాల్లో ఎవరైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలంటున్నారు సినీ జనాలు. అమీర్‌ఖాన్‌తో సీక్రెట్ సూపర్ స్టార్, లాల్ సింగ్ చడ్డా సినిమాలను తెరకెక్కించిన అద్వైత్ చందన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. అక్టోబర్ ప్రారంభంలోనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడ్డది.