అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్శశి, సాయికుమార్, పవోన్ రమేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గోపిగాళ్ల గోవా ట్రిప్’. రోహిత్, శశి దర్శకత్వం వహించారు. ఈ నెల 14న విడుదలకానుంది. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
రోడ్‌ట్రిప్ నేపథ్యంలో నడిచే కథ ఇదని, హైవే మీద ప్రయాణం చేస్తూ గోవా వరకు రియల్ లొకేషన్లలో షూటింగ్ చేశామని, సినిమా అంతా అవుట్‌డోర్‌లోనే ఉంటుందని దర్శకులు రోహిత్, శశి తెలిపారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిదని నిర్మాతలు సాయికుమార్, సీతారామరాజు, రమణా రెడ్డి పేర్కొన్నారు.