Gopichand | మాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ‘జిల్’ (Jil)సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాధా కృష్ణ కుమార్ (Radhakrishna kumar). రెండో సినిమాకే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. వీరిద్దరి కలయికలో భారీ అంచనాలతో వచ్చింది రాధేశ్యామ్. అయితే సినిమా మాత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా తర్వాత రాధా కృష్ణ కుమార్ నుంచి కొత్త సినిమా ప్రకటన రాలేదు.
అయితే ఇప్పుడు మళ్లీ గోపీచంద్ తోనే ఓ సినిమా చేయడానికి రాధా కృష్ణ కుమార్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటివలే గోపీచంద్ కి రాధ ఓ కథ చెప్పారు. సివిల్ వార్ బ్యాక్ డ్రాప్ లో వుండే ఈ కథ గోపీచంద్ కి నచ్చింది. రాధా కృష్ణ గత రెండు చిత్రాల్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం.
ప్రస్తుతం గోపీచంద్ ‘భీమా’ (Bheema)చిత్రంతో పాటు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాధా కృష్ణ కుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వుంది. తర్వలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
Radhakrishna Kumar