SDGM | బాలీవుడ్ యాక్టర్‌తో గోపీచంద్ మలినేని SDGM.. వివరాలివే
SDGM | లాంగ్ గ్యాప్ తర్వాత క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు గోపీచంద్ మలినేని Gopichand Malineni) . ఇప్పుడు ఎక్జయిటింగ్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సారి ఏకంగా బాలీవుడ్ స్టార్ యాక్టర్లలో ఒకరైన సన్నీడియోల్ (Sunny Deol)ను డైరెక్ట్ చేయబోతున్నాడు.
SDGM | లాంగ్ గ్యాప్ తర్వాత క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) . మాస్ మహారాజా రవితేజతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ఈ స్టార్ డైరెక్టర్.. రవితేజతో మరో సినిమా కూడా ప్రకటించగా పలు కారణాల వల్ల వాయిదా పడింది. కాగా గోపీచంద్ మలినేని ఇప్పుడు ఎక్జయిటింగ్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సారి ఏకంగా బాలీవుడ్ స్టార్ యాక్టర్లలో ఒకరైన సన్నీడియోల్ (Sunny Deol)ను డైరెక్ట్ చేయబోతున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ ఎస్డీజీఎం (SDGM). అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ మాస్ ఫీస్ట్ లోడింగ్ అంటూ షేర్ చేసిన అప్డేట్ మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది. త్వరలో షూటింగ్ షురూ కానుంది. ఈ చిత్రానికి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబి సినిటోగ్రాఫర్ కాగా.. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్కు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారట మేకర్స్.
మొత్తానికి ఇప్పటిదాకా టాలీవుడ్ యాక్టర్లతో బ్లాక్ బస్టర్స్ అందించిన గోపీచంద్ మలినేని ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ ఎలాంటి రికార్డులు కొల్లగొడుతాడోనని ఆసక్తిగా తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
Make way for the biggest action film of the country – #SDGM 🔥
Starring Action Superstar @iamsunnydeol 💪🏻
Directed by @megopichand 💥
Produced by @MythriOfficial & @peoplemediafcy ❤️🔥MASS FEAST LOADING!
Shoot begins soon.@MusicThaman @RishiPunjabi5 @artkolla pic.twitter.com/hwsEji2X4a— Mythri Movie Makers (@MythriOfficial) June 20, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

