Bhimaa| టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) టైటిల్ రోల్లో నటించిన చిత్రం భీమా (BHIMAA). కన్నడ డైరెక్టర్ ఏ హర్ష (A Harsha) దర్శకత్వంలో గోపీచంద్ 31(GopiChand 31) తెరకెక్కిన ఈ మూవీ మార్చి 8న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. గోపీచంద్ డ్యుయల్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. కాగా భీమా ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సందడి చేస్తోంది.
భీమా ఇక అందరి ఇండ్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. భీమా వరల్డ్ టీవీ ప్రీమియర్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రం మే 26న స్టార్ మా ఛానల్లో మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రీమియర్ కానుంది. మరి భీమా టీవీలో ఎలాంటి టీఆర్పీ రేటింగ్ నమోదు చేస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. రవి బస్రూర్ కంపోజ్ చేసిన The Rage of Bhimaa ట్రాక్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది.
భీమాలో గోపీచంద్‌ను ఇదివరకెన్నడూ చూపించని విధంగా స్టైలిష్ పోలీసాఫీసర్ అవతార్‌లో చూపించాడు డైరెక్టర్ హర్ష. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ తెరకెక్కించగా.. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంతో డైరెక్టర్ హర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
భీమాలో మాళవికా శర్మ, ప్రియా భవానీ శంకర్ ఫీ మేల్ లీడ్‌రోల్స్‌లో నటించగా.. నరేశ్, నాజర్, శుభలేక సుధాకర్, వెన్నెల కిశోర్, రోహిణి ఇతర కీలక పాత్రల్లో నటించారు.
The Rage of Bhimaa ట్రాక్..
ఏదో ఏదో మాయ సాంగ్ ప్రోమో..