గోపీచంద్ కథానాయకుడిగా బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయబాలాజీ రీల్ మీడియా పతాకంపై తాండ్ర రమేష్ నిర్మించారు. నయనతార కథానాయిక. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ‘మాస్, యాక్షన్ అంశాలు కలబోసిన కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. గోపీచంద్ సరికొత్త పంథాలో కనిపిస్తారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలుంటాయి’ అని చిత్రబృందం తెలిపింది. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అభిమన్యుసిన్హా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బాలమురుగన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంభాషణలు: అబ్బూరి రవి, స్క్రిప్ట్‌రైటర్: వక్కంతం వంశీ, దర్శకత్వం: బి.గోపాల్.