కర్ణాటక, కేరళలోని కరావళి (తులునాడు) ప్రాంతంలో పూజింపబడే ప్రధాన దేవత కొరగజ్జ చుట్టూ అల్లుకున్న కథతో రూపొందిస్తున్న బహుభాషా చిత్రం ‘కొరగజ్జ’. సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరాల్ని సమకూర్చుతున్నారు. తాజాగా ఈ సినిమా సంగీతం గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘ఈ సినిమా కోసం ఎంతో పరిశోధన చేశా. సంగీతపరంగా కూడా కొత్త ప్రయోగాలు చేయాల్సి వచ్చింది. తులునాడు ఆచారవ్యవహారాలు, సంస్కృతిని అర్థం చేసుకొని ట్యూన్స్ కంపోజ్ చేశాను. ఇందులో ఆరు పాటలు వేటికవే ప్రత్యేకంగా అనిపిస్తాయి. శ్రేయాఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, స్వరూప్ఖాన్, అర్మాన్ మాలిక్ వంటి ప్రముఖ గాయకులు పాటల్ని ఆలపించారు’ అన్నారు. ‘కాంతార’ కంటే భిన్నమైన చిత్రమిదని, 800 ఏళ్ల క్రితం నాటి గిరిజనుల సంబంధిత దేవుడి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు సుధీర్ అత్తవర్ తెలిపారు. కబీర్బేడి, సందీప్ సోపార్కర్, శృతి, భవ్య తదితరులు నటించిన ఈ కన్నడ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.