Leo | కోలీవుడ్ హీరో దళపతి విజయ్ (Vijay) కాంపౌండ్ నుంచి వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లియో (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన లియో ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియోతోపాటు నా రెడీ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దళపతి విజయ్, అనిరుధ్ రవిచందర్ కలిసి పాడిన ఈ పాట నెట్టింట వ్యూస్ పంట పండిస్తోంది. తాజాగా విజయ్ అభిమానులను థ్రిల్‌కు గురి చేసే న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. లియో షూటింగ్ పూర్తి చేసుకుంది.
మిషన్ విజయవంతంగా ముగిసింది. అక్టోబర్ 19న థియేటర్లలో కలుద్దాం.. అంటూ మేకర్స్ ట్వీ్ట్ చేశారు. లియో సెట్లో మీ చివరి రోజు కావడం చాలా భావోద్వేగపూరితంగా ఉంది. విజయ్ మీలాంటి అంకిత భావం, కష్టపడేతత్వం ఉన్న వ్యక్తిని ఎన్నడూ చూడలేదు. నిబద్ధతకు ప్రతిరూపం మీరు. ఇది జీవితకాల అనుభవం.. ఎప్పటిలాగే ప్రతిరోజూ మీ నుండి నేర్చుకుంటూనే ఉంటాం.. ధన్యవాదాలు. మీరిచ్చిన అవకాశం పట్ల ఎప్పటికీ రుణపడి ఉంటాను. అతి త్వరలో మీ మ్యాజిక్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు వేచి ఉండలేకపోతున్నామని కోప్రొడ్యూసర్ జగదీష్ ట్వీట్ చేశారు.
లియో చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న లియో అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ డైలాగ్స్ అందిస్తున్నారు. విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో మాస్టర్ తర్వాత వస్తున్న రెండో సినిమా కావడంతో లియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Mission successful ah mudinchu 🔥
Oct 19th kondaadi kolutha ready aagikonga nanba 💣
It’s a shoot wrap for #LEO#Thalapathy @actorvijay sir, @Dir_Lokesh @anirudhofficial @Jagadishbliss @7screenstudio @trishtrashers @duttsanjay @akarjunofficial @SonyMusicSouth#LEOShootWrap pic.twitter.com/GyPYXsM4ul
— Seven Screen Studio (@7screenstudio) July 10, 2023
Very emotional being the last day of yours, at the set of #Leo. Never imagined a person with such dedication, hard work and flexibility as you @actorvijay na. You are an epitome of commitment, it was a life time experience, learning from you daily as always. Thank you @actorvijay… pic.twitter.com/5kaULEyzle
— Jagadish (@Jagadishbliss) July 10, 2023
నా రెడీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
నా రెడీ సాంగ్ ప్రోమో..
లియో టైటిల్ ప్రోమో..